'అరవింద సమేత'లో నేను ఇంకా బాగా చేయాల్సింది: జగపతిబాబు
- 'అరవింద సమేత' మళ్లీ చూశాను
- 'బసిరెడ్డి'గా కొన్ని సీన్స్ లో ఇన్వాల్వ్ కాలేకపోయాను
- మూడ్ బాగుండాలనే విషయం అర్థమైందన్న జగపతిబాబు
'ఇంటిపట్టునే ఖాళీగా ఉంటున్నాను గదా .. అందువలన గతంలో నేను చేసిన సినిమాలను మళ్లీ చూసుకుంటున్నాను. బాగా చేశానా .. లేదా అని నాకు నేను గా ప్రశ్నించుకుంటున్నాను. అలా 'అరవింద సమేత' చూసిన తరువాత, 'బసిరెడ్డి' పాత్రను ఇంకా బాగా చేయాల్సిందనిపించింది. కొన్ని సన్నివేశాల్లో నేను పూర్తిగా ఇన్వాల్వ్ కాలేదనిపించింది. అప్పుడు నా మూడ్ బాగోలేకపోవడమే అందుకు కారణమనుకుంటున్నాను. మూడ్ బాగోలేకపోతే ఆ ప్రభావం నటనపై పడుతుందని నాకు అర్థమైంది. అందుకే ఇకపై అలా జరగకుండా రిలాక్స్డ్ గా వుండాలని భావిస్తున్నాను" అని చెప్పుకొచ్చారు.