తన తనయుడికి మహేశ్ పాత్ర పేరును పెట్టిన అనిల్ రావిపూడి
- 'సరిలేరు నీకెవ్వరు'తో హిట్
- అజయ్ కృష్ణ పాత్రలో మహేశ్
- ఆ పాత్ర పట్ల ప్రేమను చాటుకున్న దర్శకుడు
ఆ సినిమా సక్సెస్ ఇచ్చిన ఆనందం .. ఆ సమయంలో ఆయన పొందిన అనుభూతి ఎప్పటికీ గుర్తుండేలా ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. 'సరిలేరు నీ కెవ్వరు' సినిమాలో మహేశ్ బాబు పాత్ర పేరు 'అజయ్ కృష్ణ'. మహేశ్ పాత్రను డిజైన్ చేసిన కారణంగా ఆ పాత్ర జనంలోకి దూసుకుపోయింది. ఆ పాత్ర పేరులో నుంచి 'అజయ్'ను తీసుకుని, ఆ పేరు పక్కన 'సూర్యాంశ్' ను జోడించాడు. అలా ఆయన తన తనయుడికి 'అజయ్ సూర్యాంశ్ 'అని నామకరణం చేసినట్టుగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మహేశ్ బాబు పట్ల అభిమానం .. ఆ పాత్ర పట్ల ప్రేమ కారణంగానే తాను అలా చేశానని ఆయన అన్నాడు.