సమంత మూవీలో గెస్టుగా చైతూ
- గతంలో హిట్ కొట్టిన 'ఓ బేబీ'
- మళ్లీ సమంతతో నందినీ రెడ్డి
- త్వరలో పట్టాలెక్కనున్న ప్రాజెక్టు
'ఓ బేబీ' మాదిరిగానే సమంత ప్రధాన పాత్రధారిగా నందినీ రెడ్డి ఒక కథను సిద్ధం చేసిందట. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన అతిథి పాత్రను యంగ్ హీరోతో చేయిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని నందినీ రెడ్డి వ్యక్తం చేయగా, ఆ పాత్రకు చైతూను సమంత ఒప్పించిందని అంటున్నారు. గతంలో నందినీ రెడ్డి .. సమంత కాంబినేషన్లో వచ్చిన ' ఓ బేబీ' సినిమాలోను చైతూ మెరిసిన సంగతి తెలిసిందే.