భార్యతో విడాకులు తీసుకున్నాకే గుత్తా జ్వాల పరిచయం అయింది: విష్ణు విశాల్
- జ్వాల, విష్ణు విశాల్ డేటింగ్
- త్వరలో పెళ్లి చేసుకోబోతున్న జంట
- గతంలో తన విడాకులకు జ్వాల కారణం కాదని విష్ణు విశాల్ వెల్లడి
గుత్తా జ్వాలతో ప్రేమ వ్యవహారం కారణంగానే తన కాపురంలో కలతలు వచ్చాయని ప్రచారం జరిగిందని, వాస్తవానికి రజనీతో విడాకుల తర్వాతే తనకు గుత్తా జ్వాల పరిచయం అయిందని స్పష్టం చేశారు. విడాకుల తర్వాత ఎంతో మానసిక వేదనకు లోనైన సందర్భంలో జ్వాల తన జీవితంలోకి వచ్చిందని వివరించారు. తన దాంపత్య జీవితం విచ్ఛిన్నం కావడానికి జ్వాల ఎంతమాత్రం కారణం కాదని స్పష్టం చేశారు. అంతేకాకుండా, అమలాపాల్ ను కూడా ఈ వివాదంలోకి లాగారని, ఆమె కారణంగానే తన పెళ్లి విడాకుల వరకు వెళ్లిందని ప్రచారం చేశారని విష్ణు విశాల్ ఆవేదన వ్యక్తం చేశారు.