మహేశ్ సరసన సారా అలీఖాన్?
- పరుశురాం దర్శకత్వంలో కొత్త సినిమా!
- హీరోయిన్ కోసం చిత్ర బృందం అన్వేషణ
- బాలీవుడ్ యువతార పేరు ఖరారు!
ఈ చిత్రం షూటింగ్ అక్టోబర్ లో మొదలయ్యే అవకాశం ఉంది. మహేశ్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ ను చిత్ర బృందం ఖరారు చేసినట్టు తెలుస్తోంది. తొలుత కీర్తి సురేశ్, కైరా అద్వానీలో ఒకరిని హీరోయిన్‌గా ఎంచుకుంటారన్న వార్తలు వచ్చాయి. అయితే, అనూహ్యంగా బాలీవుడ్ యువ తార సారా తెరపైకి వచ్చింది. దీనిపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.