'ఆచార్య' నుంచి త్రిష అందుకే తప్పుకుంది: చిరంజీవి
- త్రిషకి ఎవరితోను గొడవలు లేవు
- ఆమె మణిరత్నం సినిమా చేస్తోంది
- డేట్లు కుదరకనే తప్పుకుందన్న చిరూ
తాజా ఇంటర్వ్యూలో ఈ విషయానికి సంబంధించిన ప్రశ్న ఎదురుకావడంతో చిరంజీవి స్పందిస్తూ .. "ఈ విషయాన్ని గురించి నేను యూనిట్ సభ్యులతో మాట్లాడాను. ఎవరితోనూ ఆమెకి ఎలాంటి గొడవలేదు. ఏ విషయంపై ఎవరితోను విభేదాలు తలెత్తలేదు. మణిరత్నం సినిమా కోసం ఆమె ఎక్కువ డేట్లు కేటాయించవలసి వచ్చింది. అందువల్లనే ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. అంతేగానీ ఇందులో ఎలాంటి వివాదాస్పదమైన అంశం లేదు" అని చెప్పుకొచ్చారు.