నేనింకా స్క్రిప్ట్ రెడీ చేసే పనిలోనే ఉన్నాను: దర్శకుడు మారుతి
- గతంలో సక్సెస్ సాధించిన 'భలే భలే మగాడివోయ్'
- నానితో మారుతి సినిమా అంటూ ప్రచారం
- ఈ విషయంపై స్పందించిన మారుతి
ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా రూపొందనున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ ప్రచారంపై తాజాగా మారుతి స్పందిస్తూ .. "నా తదుపరి సినిమా పట్ల ఆసక్తిని కనబరుస్తున్నందుకు ఆనందంగా వుంది. అయితే నాని హీరోగా సినిమా చేయనున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదు. నేనింకా స్క్రిప్ట్ ను సిద్ధం చేసే పనిలోనే వున్నాను. అది పూర్తయిన తరువాత, అందుకు సంబంధించిన వివరాలను నేనే స్వయంగా చెబుతాను" అన్నాడు.