తమకు ప్రాణగండం ఉందని తెలిసి కూడా సేవలు అందిస్తున్నారు... వారికి శిరసా నమామి: చంద్రబాబు
- ప్రపంచ ఆరోగ్య దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
- ప్రాణాలకు తెగించి వైద్య సిబ్బంది సేవలందిస్తున్నారని ప్రశంసలు
- సెల్ఫ్ క్వారంటైన్ తో అందరినీ కాపాడుకుందాం అంటూ పిలుపు
ప్రస్తుతం ప్రజారోగ్యం ప్రపంచవ్యాప్తంగా పెనుప్రమాదంలో పడిందని, ఇలాంటి తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలను పాటించడం అందరి విధి అని చంద్రబాబు సూచించారు. వైరస్ కట్టడికి చేస్తున్న కృషిలో అందరం భాగస్వాములం అవుదామని పిలుపునిచ్చారు. సెల్ఫ్ క్వారంటైన్ తో మన ప్రాణాలు కాపాడుకోవడమే కాదు, మన కుటుంబం, మన సమాజం ఆరోగ్యాన్ని కూడా కాపాడుదాం అంటూ పేర్కొన్నారు.