రోజు కూలీ సినీ కార్మికులకు అండగా ఉంటానన్న తన కోడలిపై చిరంజీవి ప్రశంసలు!
- సీసీసీ ధ్రువీకరించిన రోజు వారీ సినీ కార్మికులకు ఉచితంగా మందులు
- అన్ని అపోలో మందుల స్టోర్స్ నుంచి పొందవచ్చు
- పెద్ద మనసు చాటుకున్న ఉపాసన అంటూ చిరంజీవి ప్రశంస
ఈ సందర్భంగా తన కోడలినిప్రశంసిస్తూ చిరంజీవి ఓ ట్వీట్ చేశారు. సీసీసీ తో ధ్రువీకరించబడిన రోజు వారి సినీ కార్మికులందరికీ ఉచితంగా మందులు అందజేయాలన్న ఆలోచనతో ముందుకొచ్చిన తన కోడలికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. రోజువారీ సినీ కార్మికులు అన్ని అపోలో ఫార్మసీ స్టోర్ల ద్వారా ఈ మందులు పొందవచ్చని అన్నారు.