తెలంగాణలో వైద్యులపై దాడులకు పాల్పడితే నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేస్తాం: డీజీపీ మహేందర్ రెడ్డి
- ‘కరోనా’ బాధితులకు వైద్య సేవలందించే వారిపై దాడులు చేస్తే సహించం
- వైద్యులు, సిబ్బంది భద్రతకు మరిన్ని చర్యలు చేపట్టాం
- పోలీస్ స్టేషన్ల పరిధిలో వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేశాం
హైదరాబాద్ లో మూడు కమిషనరేట్ల పరిధిలో పోలీసులు, వైద్యులు, జీహెచ్ ఎంసీ అధికారులతో పోలీస్ -మెడికల్ వాట్సప్ గ్రూప్ , ఆశా వర్కర్లు, హెల్త్ వర్కర్లతో మెడికల్ నోడల్ వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేశామని వివరించారు. వైద్యులు, ఆయా శాఖల సిబ్బందిపై ఎవరైనా దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేసి, వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు.