'ఆర్ ఆర్ ఆర్' విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత
- 75 శాతం షూటింగు జరుపుకున్న 'ఆర్ ఆర్ ఆర్'
- లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన షూటింగ్
- జనవరి 8వ తేదీనే విడుదల
ఈ నేపథ్యంలో ఈ సినిమా నిర్మాత డీవీవీ దానయ్య ఒక ఆంగ్ల దిన పత్రికతో మాట్లాడుతూ, లాక్ డౌన్ కారణంగా 'ఆర్ ఆర్ ఆర్' సినిమా విడుదల వాయిదా పడుతుందంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని చెప్పారు. ఇప్పటికే గ్రాఫిక్స్ వర్క్ కూడా చాలా వరకూ పూర్తయిందనీ, ముందుగా చెప్పిన ప్రకారమే ఈ సినిమాను జనవరి 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని అన్నారు.