తనయతో కలిసి సినిమాలు చూస్తూ ఆస్వాదిస్తున్న మహేశ్ బాబు
- షూటింగ్ లు లేక ఇంటికే పరిమితమైన మహేశ్ బాబు
- కుమార్తె సితారతో కలిసి స్టూవర్ట్ లిటిల్ సినిమా చూస్తున్నట్టు ట్వీట్
- ఇంటి వద్దే ఉంటూ కరోనా నుంచి కాపాడుకోవాలని పిలుపు
"ఇది తండ్రీకుమార్తెలకు ప్రత్యేకం! స్టూవర్ట్ లిటిల్ పార్ట్ వన్ వస్తోంది. రేపు పార్ట్ 2 వరకు వేచి ఉండలేం! మనందరం ఇంటివద్ద ఏదో ఒకటి చేసేందుకు ఆలోచిస్తూనే ఉండాలి. మనకిష్టమైన వాళ్లు ఎలాగూ మనల్ని వదిలిపెట్టరు కదా!" అంటూ స్పందించారు. అంతేకాదు, ఇంటివద్దే ఉండడం ద్వారా కరోనా నుంచి కాపాడుకోవాలని మరోసారి పిలుపునిచ్చారు.