వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ
- 'బ్రోచేవారెవరురా'తో హిట్ కొట్టిన వివేక్ ఆత్రేయ
- విజయ్ దేవరకొండ నుంచి గ్రీన్ సిగ్నల్
- మొదలైన ప్రీ ప్రొడక్షన్ పనులు
నిజానికి విజయ్ దేవరకొండకి చాలామంది యువ దర్శకులు కథలను వినిపించి వున్నారు. అయితే వాటిలో కాస్త భిన్నంగా అనిపించిన కథకి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఆయనకి ఆ కథను వినిపించిన దర్శకుడు ఎవరో కాదు .. వివేక్ ఆత్రేయ. 'బ్రోచేవారెవరురా' సినిమాతో హిట్ కొట్టిన వివేక్ ఆత్రేయ, ఈ సారి మరో యూత్ ఫుల్ సబ్జెక్ట్ తో సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయట. ఇంతవరకూ విజయ్ దేవరకొండ చేసిన పాత్రలకి ఈ కథ పూర్తి భిన్నంగా ఉంటుందని అంటున్నారు.