Sai tej: ముఖ్యమంత్రి పాత్రలో రమ్యకృష్ణ .. స్టూడెంట్ లీడర్ గా సాయితేజ్
- సాయితేజ్ నెక్స్ట్ మూవీ దేవ కట్టాతో
- విద్యా విధానంలోని లోపాలపై సాగే కథ
- హైలైట్ గా నిలవనున్న రమ్యకృష్ణ పాత్ర
సాయితేజ్ తాజా చిత్రంగా 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా రూపొందింది. మే నెలలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఆ తరువాత సినిమాను దేవ కట్టా దర్శకత్వంలో చేయడానికి సాయితేజ్ సిద్ధమవుతున్నాడు. భగవాన్ - పుల్లారావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ పవర్ఫుల్ పొలిటికల్ లీడర్ గా కనిపించనుందనే వార్తలు వచ్చాయి.
ఆమె ఈ సినిమాలో ముఖ్యమంత్రి పాత్రను పోషించనుందనేది తాజా సమాచారం. సాయితేజ్ స్టూడెంట్ లీడర్ పాత్రలో కనిపించనున్నాడని అంటున్నారు. నేటి విద్యా విధానంలోని లొసుగులపై తిరుగుబాటు కథాంశంతో ఇది నడుస్తుందని చెబుతున్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రినే నిలదీసే పాత్రలో సాయితేజ్ కనిపించనున్నాడని అంటున్నారు. రమ్యకృష్ణ పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు.