తరుణ్ భాస్కర్ తో ఎన్టీఆర్ మూవీ?
- 'ఆర్ ఆర్ ఆర్' పైనే ఎన్టీఆర్ దృష్టి
- అభిమానుల్లో పెరుగుతున్న ఆసక్తి
- ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ కోసమే తరుణ్ వెయిటింగ్
ఓ ఇంటర్వ్యూలో తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ, ఆల్రెడీ ఎన్టీఆర్ కి ఒక కథను వినిపించినట్టుగా చెప్పాడు. ఎన్టీఆర్ నుంచి సమాధానం రావలసి వుంది. తరుణ్ భాస్కర్ వైవిధ్యభరితమైన కథలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తాడు. ఆయన టేకింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. తనదైన స్టైల్లో ఎన్టీఆర్ ను చూపించడానికి ఆయన ఆసక్తిని చూపుతున్నాడు. ఎన్టీఆర్ ఓకే అంటే ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుంది. ఆ రెండు అక్షరాలు ఆయన నోటి నుంచి వచ్చే క్షణం కోసమే తరుణ్ భాస్కర్ ఎదురుచూస్తున్నాడు. ఎన్టీఆర్ ఏమంటాడో చూడాలి మరి.