నీవు ఒక యుద్ధ వీరుడివి: హీరో నితిన్ పై చిరంజీవి ప్రశంసలు
- కరోనా నేపథ్యంలో వివాహాన్ని వాయిదా వేసుకున్న నితిన్
- నీ స్ఫూర్తి చాలా గొప్పదన్న చిరంజీవి
- కాబోయే దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్
కరోనాపై పోరాటంలో నీ స్ఫూర్తి చాలా గొప్పదని... మన దేశాన్ని ఆ మహమ్మారి కబళించకుండా చేస్తున్న పోరాటంలో నీ పాత్ర ప్రశంసనీయమని అన్నారు. 'నీకు, నీ కాబోయే భార్యకు శుభాకాంక్షలు' అని తెలిపారు. కరోనా నేపథ్యంలో ప్రధాని, ఏపీ, టీఎస్ సీఎంల నిధికి నితిన్ 20 లక్షల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు కరోనా నేపథ్యంలో తన వివాహాన్ని నితిన్ వాయిదా వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో, నితిన్ పై చిరు ప్రశంసలు కురిపించారు.