కరోనా వైరస్ నేపథ్యంలో ప్రశాంత్ వర్మ సినిమా
- 'అ' సినిమాతో మంచి పేరు
- 'కల్కి' సినిమాతో గుర్తింపు
- తదుపరి సినిమాకి సన్నాహాలు
తాజాగా ఆయన ఒక కథపై కూర్చున్నాడని అంటున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఈ వైరస్ చాలా వేగంగా ప్రయాణిస్తోంది. ఈ వైరస్ ను కట్టడి చేయడానికి ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవడంలో తలమునకలై వున్నాయి. అలాంటి ఈ వైరస్ ను నేపథ్యంగా తీసుకుని ప్రశాంత్ వర్మ ఒక కథను సిద్ధం చేస్తున్నాడట. ఓ అప్ కమింగ్ హీరోతో ఆయన ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.