ఈ సాయం కావాలి మరిన్ని సాయాలకు 'నాంది'!: సినీ నటుడు ‘అల్లరి’ నరేశ్
- ‘నాంది’ యూనిట్ లో రోజువారీ వేతన కార్మికులు 50 మంది ఉన్నారు
- లాక్ డౌన్ వల్ల వారు ఆర్థిక ఇబ్బందులు పడకూడదు
- మా నిర్మాత సతీశ్ వేగేశ్న, నేను కలిసి వారికి సాయం అందిస్తాం
ఈ 21 రోజుల లాక్ డౌన్ వల్ల ఇబ్బంది పడే వారిలో తమ ‘నాంది’ చిత్ర యూనిట్ లో రోజువారీ వేతనంతో జీవనం సాగించే 50 మందికి పైగా కార్మికులు ఉన్నారని, వారు ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఉండాలని చూస్తున్నామని అన్నారు. తమ నిర్మాత సతీశ్ వేగేశ్న, తాను కలిసి ఈ యాభై మందికి ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున సాయం అందించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ‘ఇది గుర్తింపు కోసం చేస్తున్న ప్రయత్నం కాదు.. సాటి మనిషికి సాయం చెయ్యడం మన కర్తవ్యం.. ఈ సాయం కావాలి మరిన్ని సాయాలకు నాంది..’ అంటూ ఓ ట్వీట్ లో పేర్కొన్నారు.