మలయాళ రీమేక్ లో హీరోగా లారెన్స్
- మలయాళంలో హిట్ కొట్టిన 'అయ్యప్పనుం కోశియుం'
- తమిళ రీమేక్ లో లారెన్స్ - ప్రియా భవాని
- తెలుగు రీమేక్ కి సన్నాహాలు
పృథ్వీరాజ్ సుకుమారన్ .. బిజూ మీనన్ నటించిన ఈ సినిమాను, తమిళంలో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో లారెన్స్ కథానాయకుడిగా నటిస్తుండగా, ఆయనకు జోడీగా ప్రియా భవానీని ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమాకి లారెన్స్ దర్శకత్వం వహిస్తాడా? లేదా? అనే విషయంలో క్లారిటీ రావలసి వుంది. 'అయ్యప్పనుం కోశియుం' సినిమాను తెలుగులో కూడా రీమేక్ చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. రానా - వెంకటేశ్ కాంబినేషన్ ఈ కథకి కరెక్ట్ గా సెట్ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.