కరోనాపై పోరు ఇలాగేనా?.. పౌరుల తీరుపై సినీ నటి అనుపమ పరమేశ్వరన్ ఆగ్రహం
- ఏంటిది?.. చెత్తకుండీలు ఉన్నాయిగా
- వాడి రోడ్డుపై పారేయడం సరికాదు
- రోడ్డుపై కనిపించిన వాటిని తాకొద్దు
మనం కరోనాతో పోరాడుతున్న తీరు ఇదేనా? అని ప్రశ్నించింది. వాడి పారేసిన మాస్కులను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా చెత్తకుండీల్లో వేయాలని కోరింది. ఎవరికైనా ఇలాంటి మాస్కులు కనిపిస్తే తాకొద్దు, వాడొద్దని సూచించింది. తన డాక్టర్ ఫ్రెండ్‌కు ఐసోలేషన్ వార్డుకు వెళ్లే దారిలో ఇవన్నీ కనిపించాయని అనుపమ పేర్కొంది.