పూరితో సినిమా చేయడానికి మొగ్గుచూపుతున్న మహేశ్ బాబు?
- పూరితో రెండు హిట్లు కొట్టిన మహేశ్
- ఆ తరువాత సెట్ కాని ప్రాజెక్ట్
- త్వరలో సినిమా చేసే అవకాశం
ఈ ఇద్దరి మధ్య చిన్నపాటి అభిప్రాయ భేదాలు రావడం వల్లనే మరో ప్రాజెక్టు సెట్ కాలేదనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఈ ఇద్దరి కాంబినేషన్ ను మళ్లీ సెట్ చేయాలనే ఉద్దేశంతో సన్నిహితులు కొందరు రంగంలోకి దిగారట. పూరితో సినిమా చేయడానికి మహేశ్ బాబు కూడా మొగ్గుచూపుతుండటంతో, ఈ ప్రయత్నాలు మొదలయ్యాయని అంటున్నారు. ఈ ప్రయత్నాలు ఫలిస్తే పూరి - మహేశ్ బాబు కాంబినేషన్లో మరో సినిమా రావడం ఖాయమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.