కరోనా కారణంగా సెట్స్ పైకి వెళ్లని 'బంగార్రాజు'
- నాగ్ తాజా చిత్రంగా 'బంగార్రాజు'
- వాయిదా పడిన రెగ్యులర్ షూటింగ్
- ముఖ్యమైన పాత్రలో రమ్యకృష్ణ
ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కావొస్తుండటంతో, ఏప్రిల్ 2వ వారంలో రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టాలనుకున్నారు. అయితే కరోనా ఎఫెక్ట్ కారణంగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగు కూడా వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే వివిధ కారణాల వలన వాయిదా పడుతూ వచ్చిన 'బంగార్రాజు' .. కరోనా కారణంగా మరోసారి వాయిదా పడనుందన్న మాట. రమ్యకృష్ణ .. చైతూ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్న సంగతి తెలిసిందే.