అరగంటపాటు ఉరికొయ్యకు వేలాడిన నిర్భయ దోషులు.. చనిపోయినట్టు వైద్యుల నిర్ధారణ
- శిక్ష అమలు తర్వాత ప్రొటోకాల్ అమలు
- అరగంట తర్వాత కిందికి దించి పరీక్షించిన వైద్యులు
- చనిపోయినట్టు నిర్ధారించాక పోస్టుమార్టానికి తరలింపు
దోషులు చివరి ప్రయత్నంగా సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఈ తెల్లవారుజామున 5:30 గంటలకు వారికి ఉరిశిక్ష అమలు చేశారు. ఒకే నేరానికి సంబంధించి ఒకేసారి నలుగురికీ మరణదండన అమలు చేయడం తీహార్ జైలులో ఇదే తొలిసారి. ఉరితీత అనంతరం నిర్భయ తల్లి మాట్లాడుతూ.. ఎట్టకేలకు తమకు న్యాయం జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు.