విష్వక్సేన్ కొత్త సినిమా లాంచ్ రేపే
- మాస్ హీరోగా విష్వక్సేన్ కి గుర్తింపు
- నూతన దర్శకుడిగా నరేశ్ పరిచయం
- త్వరలో పూర్తి వివరాలు
లక్కీ మీడియా బ్యానర్లో బెక్కం వేణుగోపాల్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాతో నరేశ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. రాధన్ సంగీత దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ఇతర నటీనటుల వివరాలను .. సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియపరచనున్నారు. ఇప్పటికే మాస్ ఆడియన్స్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న విష్వక్ సేన్, ఈ సినిమాతో తన క్రేజ్ ను మరింత పెంచుకుంటాడేమో చూడాలి.