ఈ నెల 20న ఉరికి సన్నాహాలు... విడాకులు కోరిన నిర్భయ దోషి భార్య!
- విడాకులు కోరుతూ అక్షయ్ కుమార్ సింగ్ భార్య పిటిషన్
- ఓ దోషి భార్యగా ఉండదలుచుకోలేదని వెల్లడి
- ఈ పిటిషన్ పై సందేహాలు వ్యక్తం చేస్తున్న న్యాయనిపుణులు
తన భర్త నిర్దోషి అని, కానీ అతడిని దోషిగా తేల్చి ఉరిశిక్ష విధించారని, అత్యాచారం కేసులో ఉరితీతకు గురైన వ్యక్తికి భార్యగా ఉండదలుచుకోలేదని చెబుతూ ఔరంగాబాద్ ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసింది. న్యాయనిపుణులు ఈ విడాకుల పిటిషన్ పై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో పునీత భర్త అక్షయ్ కుమార్ సింగ్ కు కోర్టు నోటీసులు పంపాల్సి ఉంటుందని, ఈ కేసులో తీర్పు వచ్చేసరికి మరింత ఆలస్యం అవుతుందని అభిప్రాయపడుతున్నారు.