Gandhi Hospital: గాంధీ ఆసుపత్రి డాక్టర్ల నిర్వాకం: 9 నెలల గర్భిణీకి చేయాల్సిన శస్త్రచికిత్సను 7 నెలల గర్భిణీకి చేశారు!

  • గాంధీలో డాక్టర్ల నిర్లక్ష్యం!
  • పొరబాటు సర్జరీ కారణంగా బిడ్డ మృతి
  • తల్లి పరిస్థితి విషమం

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో అత్యంత బాధాకరమైన సంఘటన జరిగింది. డాక్టర్లు నిర్లక్ష్యంతో వ్యవహరించి ఓ శిశువు మృతికి కారణమయ్యారు. 9 నెలల గర్భిణీకి చేయాల్సిన శస్త్రచికిత్సను 7 నెలల గర్భిణీకి చేసి బిడ్డ మృతికి కారకులవడమే కాకుండా తల్లి ప్రాణాలకూ ముప్పు తెచ్చిపెట్టారు. సమత అనే యువతి ప్రసవం కోసం మరో 2 నెలలు వేచి చూడాల్సి ఉండగా, పొరబాటున ఆమెకు ఆపరేషన్ నిర్వహించారు. దాంతో పూర్తిగా రూపం ఏర్పడని చిన్నారి కన్నుమూసింది. అధిక రక్తస్రావం కారణంగా సమత పరిస్థితి విషమించింది. దీనిపై సమత కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Gandhi Hospital
Doctors
Pregnant
Secunderabad
  • Loading...

More Telugu News