నాగశౌర్యతో సెట్స్ పైకి నందినీ రెడ్డి
- 'ఓ బేబీ'తో హిట్ కొట్టిన నందినీ రెడ్డి
- ప్రేమ కథాంశంతో తదుపరి సినిమా
- నిర్మాతగా ప్రియాంక దత్
వైజయంతీ మూవీస్ కి అనుబంధ సంస్థ అయిన స్వప్న సినిమాస్ బ్యానర్ పై ప్రియాంక దత్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా కోసం కథానాయకుడిగా నాగశౌర్యను తీసుకున్నారు. కథానాయిక ఎంపిక జరగవలసి వుంది. మిక్కీ జె.మేయర్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాకి, లక్ష్మీ భూపాల్ సంభాషణలను అందిస్తున్నాడు.