కరోనా నేపథ్యంలో స్వీయ నిర్బంధం విధించుకున్న బాలీవుడ్ దిగ్గజం దిలీప్ కుమార్
- దేశంలో నెమ్మదిగా విస్తరిస్తున్న కరోనా వైరస్
- దిలీప్ కుమార్ ను ఏకాంత గదిలో ఉంచిన సైరాబాను
- ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండేందుకే అని తెలిపిన దిలీప్ కుమార్
కరోనా సోకకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగానే స్వీయ నిర్బంధాన్ని విధించుకున్నానని ఈ సందర్భంగా దిలీప్ కుమార్ తెలిపారు. తన భార్య సైరాబాను ఎలాంటి రిస్క్ ఉండకూడదనే ముందు జాగ్రత్త చర్యగా... తనకు ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండేందుకు తనను ఏకాంత గదిలో ఉంచిందని చెప్పారు. ప్రస్తుతం దిలీప్ కుమార్ వయసు 97 సంవత్సరాలు.