అలా ఆ కథ నా దగ్గరికి వచ్చింది: యాంకర్ ప్రదీప్
- అమలాపురం మా సొంత ఊరు
- యాంకర్ గా ప్రేక్షకులు ఆదరించారు
- దర్శకుడు నన్ను ఎంచుకోవడానికి కారణమదేనన్న ప్రదీప్
తాజాగా ఆయన 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ .."అమలాపురం మా సొంత ఊరు .. నేను పుట్టింది అక్కడే అయినా, పెరిగింది హైదరాబాదులోనే. యాంకర్ గా ప్రేక్షకులు ఆదరించడం వలన హీరోనయ్యాను. నిజానికి ఈ కథను దర్శకుడు మున్నా నా కోసం రాయలేదు. ఆయన కథను సిద్ధం చేసుకున్న తరువాత, తన ఇంట్లో టీవీలో వస్తున్న నా ప్రోగ్రామ్ చూస్తూ ఆయన తల్లీ .. భార్య అదే పనిగా నవ్వుతున్నారట. ఈ సినిమా కథలో ఆడవాళ్ల ప్రాధాన్యత ఎక్కువగా ఉండటం వలన, ఆ సబ్జెక్ట్ ను నా ద్వారా చెప్పిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన నన్ను ఎంచుకున్నాడు. అలా ఆ కథ నా దగ్గరికి వచ్చింది" అని చెప్పుకొచ్చాడు.