మేం డేటింగ్ లో ఉన్నాం, త్వరలోనే ఒక్కటవుతాం: గుత్తా జ్వాల
- విష్ణు విశాల్ తో రిలేషన్ షిప్ పై స్పందించిన జ్వాల
- పెళ్లి ఎప్పుడో కచ్చితంగా చెప్పలేనని వెల్లడి
- అందరికీ చెప్పే చేసుకుంటానని వివరణ
అంతేకాదు, జ్వాల ప్రస్తుత రాజకీయాలపైనా తన అభిప్రాయాలను పంచుకుంది. కొన్ని జాతీయ పార్టీలు తనను రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించాయని, అయితే తన భావజాలానికి తగిన పార్టీలు ఏవీ కనిపించలేదని, అందుకే రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. తన కెరీర్ గురించి చెబుతూ, ఒకప్పుడు డబుల్స్ క్రీడాకారులకు దిశానిర్దేశం చేసేందుకు ఎవరూ ఉండేవారు కాదని, కానీ ఇప్పుడు దేశంలోని డబుల్స్ ప్లేయర్లకు మార్గదర్శనం చేసేందుకు తానున్నానని జ్వాల ఉద్ఘాటించింది.