బన్నీ మూవీలో విజయ్ సేతుపతి చేయడం లేదట
- తమిళనాట విపరీతమైన క్రేజ్
- తెలుగులోను మంచి గుర్తింపు
- బన్నీ మూవీకి సంబంధించి అది పుకారేనట
ఆ తరువాత ఆయన బన్నీ కథానాయకుడిగా చేస్తున్న సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రను చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. సుకుమార్ దర్శకత్వంలో బన్నీ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఫారెస్ట్ నేపథ్యంలో సాగే ఈ కథలో ఫారెస్ట్ ఆఫీసర్ పాత్ర కోసం విజయ్ సేతుపతిని తీసుకున్నట్టుగా ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారంలో నిజం లేదనేది తాజా సమాచారం. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, మిగతా నటీనటుల వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.