టీడీపీ పనైపోయిందన్న వాళ్లకు నామినేషన్ల దాఖలే దీటైన జవాబు: ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి
- వైసీపీ బెదిరింపులకు తట్టుకుని నిలిచామని ధీమా
- 92 శాతం నామినేషన్లు వేశామని వెల్లడి
- ఏకగ్రీవం అయింది 84 స్థానాలేనన్న దీపక్ రెడ్డి
టీడీపీ నేతలను బెదిరించి 482 నామినేషన్లు వెనక్కి తీసుకునేలా చేశారని దీపక్ రెడ్డి ఆరోపించారు. 224 స్థానాల్లో నామినేషన్ల విత్ డ్రాలో పోలీసుల పాత్ర ఉందని అన్నారు. 83 ఎంపీటీసీ, 1 జడ్పీటీసీ కలిపి 84 స్థానాలే ఏకగ్రీవం అయ్యాయని తెలిపారు. టీడీపీని అడ్డుకునే బలం వైసీపీకి లేదని ఇక్కడే తేటతెల్లమైందని వ్యాఖ్యానించారు. టీడీపీ పనైపోయిందన్న వాళ్లకు నామినేషన్ల దాఖలే దీటైన జవాబు అని పేర్కొన్నారు.