నన్ను ఐటెమ్ అంటే ఒప్పుకోను: హీరోయిన్ రెజీనా
- 'ఆచార్య'లో సాంగ్ అనగానే ఒప్పేసుకున్నాను
- 6 రోజుల పాటు చిత్రీకరించారు
- తన కల నిజమైందన్న రెజీనా
ఆ విషయాన్ని గురించి రెజీనా స్పందిస్తూ .. "చిరంజీవిగారి సరసన ఒకపాటలో సందడి చేసే ఛాన్స్ అనేసరికి రెండో ఆలోచన లేకుండా ఒప్పేసుకున్నాను. ఆయన సరసన డాన్స్ చేయాలనే నా ముచ్చటను తీర్చుకున్నాను. అంత మాత్రానికే నన్ను ఐటెమ్ అంటే ఒప్పుకోను. ఈ సాంగును ఐటెమ్ అనొద్దు .. స్పెషల్ సాంగ్ అంటేనే నాకు బాగుంటుంది. ఈ పాటను రాత్రి వేళల్లో ఆరు రోజుల పాటు చిత్రీకరించారు. చిరంజీవి గారు నా డాన్స్ ను అభినందించడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఆ పాట చిత్రీకరణను నా జీవితంలో అందమైన క్షణాలుగా భావిస్తాను" అని చెప్పుకొచ్చింది.