'కార్తికేయ 2'లో కలర్స్ స్వాతి వుందట!
- గతంలో హిట్ కొట్టిన 'కార్తికేయ'
- సెట్స్ పైకి వెళ్లిన సీక్వెల్
- దసరాకి రిలీజ్ చేసే ఆలోచన
తాజాగా నిఖిల్ మాట్లాడుతూ .. కలర్స్ స్వాతి పాత్రకి కొనసాగింపు ఉందనీ, ఆ పాత్రలో ఆమే నటిస్తుందని స్పష్టం చేశాడు. అంతేకాదు .. ఈ సినిమాలో మరో కథానాయిక కూడా ఉంటుందనీ, ఆమెను ఎంపిక చేసే ప్రక్రియ కొనసాగుతోందని చెప్పాడు. ఆ అవకాశం ఎవరిని వరిస్తుందో చూడాలి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ .. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను, దసరాకి విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.