రజనీకాంత్ ఇంటి వద్ద అభిమానుల సందడి.. ‘తలైవా’ ప్రకటన కోసం ఉత్కంఠగా ఎదురుచూపు!
- నేడు తన మనసులోని మాటను బయటపెడతానన్న రజనీ
- ఆసక్తిగా చూస్తున్న అభిమానులు, రాజకీయ పార్టీలు
- పార్టీ ప్రకటించే అవకాశం!
రజనీకాంత్ వారం రోజుల క్రితం రజనీ మక్కల్ మండ్రం (ఆర్ఎంఎం) జిల్లా కార్యదర్శులతో సమావేశమయ్యారు. నేడు మరోమారు వారితో భేటీ కానుండడంతో అందరి దృష్టి ఒక్కసారిగా అటువైపు మళ్లింది. వారితో భేటీ తర్వాత ‘తలైవా’ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. జిల్లా కార్యదర్శులతో భేటీ అనంతరం రజనీకాంత్ విలేకరులతో మాట్లాడతారని సమాచారం. అసెంబ్లీ ఎన్నికలకు తమిళనాడు సిద్ధమవుతున్న వేళ.. రజనీ తన రాజకీయ పార్టీని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.