'బంగార్రాజు' విడుదల తేదీని కూడా ప్లాన్ చేశారట
- 'బంగార్రాజు' స్క్రిప్ట్ పై కసరత్తు
- జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్
- క్రిస్మస్ కి రిలీజ్ చేసే ఆలోచన
జూన్ మొదటివారంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగును ఆరంభించనున్నారు. క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారనేది తాజా సమాచారం. ఈ సినిమాలో నాగార్జున సరసన రమ్యకృష్ణ నటించనుండగా, చైతూ జోడీగా సమంత కనిపించనుందని అంటున్నారు. కొంత కాలంగా వరుస పరాజయాలను ఎదుర్కుంటూ వస్తున్న నాగార్జున, ఈ సినిమాతో హిట్ కొడతాడేమో చూడాలి.