విజయ్ దేవరకొండ పేరుతో అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్న యువకుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- విజయ్ పేరుతో అమ్మాయిలకు వల
- రివర్స్ గేమ్ ఆడిన విజయ్ దేవరకొండ టీమ్
- అమ్మాయి పేరుతో మోసగాడితో చాటింగ్
- హైదరాబాద్ రావాలంటూ ఆహ్వానం
- నిజమేనని నమ్మి హైదరాబాద్ వచ్చిన మోసగాడు
- వెంటనే అదుపులోకి తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు
సోషల్ మీడియాలో అమ్మాయి పేరుతో ఆ యువకుడితో చాటింగ్ చేసి ఫోన్ నెంబర్ సంపాదించారు. వెంటనే కలవాలి హైదరాబాద్ వచ్చేయి అని చెప్పడంతో నిజమేనని నమ్మిన మోసగాడు పోలీసులు పన్నిన ఉచ్చులో చిక్కుకున్నాడు. హైదరాబాద్ వచ్చిన అతడ్ని వెంటనే అదుపులోకి తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు పీఎస్ కు తరలించారు. పోలీసుల విచారణలో ఆసక్తికర విషయాలు తెలిశాయి. కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన ఇతను మరో ఇద్దరు హీరోల పేరుతో నకిలీ ఐడీలు సృష్టించి పది మంది అమ్మాయిలను మోసం చేసినట్టు వెల్లడైంది.