షూటింగ్‌లో యువ నటుడు అఖిల్‌కు గాయం.. వారం వరకు షూటింగ్ బంద్!
- ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ సినిమా షూటింగులో గాయం
- వారం రోజులు విశ్రాంతి అవసరమన్న వైద్యులు
- 10వ తేదీ తర్వాత తిరిగి షూటింగుకు
ఈ నెల 10 తర్వాత షూటింగ్ తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సినిమాలో అఖిల్‌కు జోడీగా పూజాహెగ్డే నటిస్తోంది. గీతా ఆర్ట్స్ 2 పిక్సర్స్ బ్యానర్‌పై బన్సీవాసు ఈ సినిమాను నిర్మిస్తుండగా, గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు. 70 శాతం షూటింగ్ పూర్తయింది. వేసవి సెలవుల్లో సినిమాను విడుదల చేయనున్నారు.