గోమూత్రం, పేడతో కరోనా పారిపోతుందన్న బీజేపీ మహిళా ఎమ్మెల్యే
- అసెంబ్లీలో కరోనా గురించి మాట్లాడిన అసోం మహిళా ఎమ్మెల్యే
- గోమూత్రం, పేడ క్యాన్సర్ ను కూడా తరిమికొడతాయని వెల్లడి
- బంగ్లాదేశ్ మన ఆవులను వధిస్తోందంటూ ఆగ్రహం
పొరుగునే ఉన్న బంగ్లాదేశ్ మన దేశం నుంచి ఆవులను అక్రమ రవాణా చేస్తోందని, మన ఆవులను మాంసం కోసం తీసుకెళుతూ బంగ్లాదేశ్ ఆర్థికంగా ఎంతో బలపడిందని చెప్పారు. ఇవాళ ప్రపంచంలోనే పశుమాంసం ఎగుమతిదారుల్లో బంగ్లాదేశ్ రెండో స్థానంలో ఉందని వివరించారు. వారు వధిస్తున్న ఆవులన్నీ మనవేనని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయిందని విమర్శించారు.