బాలయ్యతో సెట్స్ పైకి వెళ్లిన బోయపాటి
- రామోజీ ఫిల్మ్ సిటీలో తొలి షెడ్యూల్
- మొదలైన యాక్షన్ సీన్స్ చిత్రీకరణ
- గ్రహాలు .. అవి చూపే ప్రభావం నేపథ్యంగా సాగే కథ
ఈ రోజున ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలైంది. రామ్ లక్ష్మణ్ డిజైన్ చేసిన యాక్షన్ సీన్స్ తో షూటింగును మొదలెట్టారు. తొలి షెడ్యూల్లో యాక్షన్ ఎపిసోడ్ నే చిత్రీకరిస్తారట. బాలకృష్ణ - బోయపాటి ఇద్దరూ కూడా ఒక కొత్త పాయింట్ తో ఈ సినిమా చేస్తున్నారు. గ్రహాలు .. ప్రభావం ఒక కోణంగా, అఘోర పాత్ర మరో కోణంగా ఈ సినిమా సాగుతుందని అంటున్నారు. శ్రియ - అంజలి కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ పడటం ఖాయమనే నమ్మకంతో బాలయ్య అభిమానులు వున్నారు.