జగన్ పై అలగడం ఈ జన్మకు జరగని పని: పోసాని
- ఓ మీడియా చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన పోసాని
- జగన్ సీఎం అయ్యాక ఆయన గురించి ఇంకేం చెప్పగలమంటూ వ్యాఖ్యలు
- పదవులపై ఆశ లేదని స్పష్టీకరణ
అమరావతి ఒకే సామాజిక వర్గానికి చెందినది అని పృథ్వీ చేసిన వ్యాఖ్యలను మీరు ఖండించిన తర్వాత సీఎం జగన్ మీపై అసంతృప్తితో ఉన్నట్టు భావించవచ్చా అని యాంకర్ ప్రశ్నించగా.... తాను అలా భావించడంలేదని అని అన్నారు. జగన్ కు కులగజ్జి అస్సలు లేదని, ఆయన గురించి పూర్తిగా తెలుసుకునే ఆయన్ను సపోర్ట్ చేస్తున్నానని తెలిపారు. పృథ్వీలాంటి వాళ్లు చేసే పిచ్చి వ్యాఖ్యలతో జగన్ విశ్వసనీయత ఏంకావాలి? అని ఆవేదన కలిగిందని, అందుకే పృథ్వీ వ్యాఖ్యలను ఖండించానని అన్నారు.