మమ్మల్ని అడగకుండా మీ నిర్ణయం ఏంటి? గంగూలీని తప్పుబట్టిన ఎహ్సాన్ మణి!
- ఆసియా కప్ పోటీలపై ఇంకా నిర్ణయించలేదు
- దుబాయ్ తో పాటు ఎన్నో ప్రత్యామ్నాయాలున్నాయి
- పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు ఎహ్సాన్ మణి
తమ దేశంలో ఈ టోర్నీ జరుగకపోయినా, దుబాయ్ తో పాటు మరెన్నో ప్రత్యామ్నాయ వేదికలు ఉన్నాయని ఆయన అన్నారు. కాగా, ఈ సంవత్సరం ఆసియా కప్ పోటీలు పాకిస్థాన్ లో షెడ్యూల్ చేశారు. పాక్ కు వెళ్లేందుకు భారత్ సుముఖంగా లేదు. ఇండియా లేకుండా ఆసియా కప్ పోటీలకు స్పాన్సర్లతో పాటు, అభిమానులు కూడా తగ్గుతారని భావించిన పీసీబీ, ఈ పోటీలను మరో దేశంలో జరిపించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల గంగూలీ, ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ దుబాయ్ లో పోటీలు ఉంటాయని, ఇండియా, పాక్ లు మరోసారి తలపడతాయని వెల్లడించారు.