వైజాగ్ లో థ్యాంక్స్ మీట్ ను ఏర్పాటు చేసిన 'భీష్మ'
- వెంకీ కుడుముల రెండో చిత్రంగా 'భీష్మ'
- ఈ నెల 29వ తేదీన థ్యాంక్స్ మీట్
- ఉత్సాహాన్ని చూపుతున్న స్టార్ హీరోలు
ఈ నెల 29వ తేదీన విశాఖలోని 'గురజాడ కళాక్షేత్రం'లో సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక ప్రారంభం కానుంది. రీసెంట్ గా ఈ సినిమా టీమ్ హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వెంకీ కుడుముల రెండో సినిమాతోనూ భారీ విజయాన్ని అందుకోవడంతో, ఆయనతో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు సైతం ఉత్సాహాన్ని చూపుతున్నారు. ఆయన తన తదుపరి సినిమాను చరణ్ తో చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.