'భీష్మ' నాలుగు రోజుల వసూళ్లు
- తెలుగు రాష్ట్రాల్లో 'భీష్మ' విజయవిహారం
- యూఎస్ లోను అదే జోరు
- రష్మిక జోరును మరింత పెంచిన 'భీష్మ'
చాలా వేగంగా ఈ సినిమా ఈ స్థాయి వసూళ్లను రాబడుతుండటం, ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. దగ్గరలో చెప్పుకోదగిన సినిమాలేవీ లేకపోవడంతో, 'భీష్మ' జోరు కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. లాంగ్ రన్ లో ఈ సినిమా నితిన్ కెరియర్లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రాల జాబితాలో చేరిపోవడం ఖాయమని అంటున్నారు. వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ వెళుతున్న రష్మిక జోరును ఈ సినిమా మరింతగా పెంచింది. ఇక తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ లోను ఈ సినిమా భారీ వసూళ్లతో దూసుకెళుతుండటం విశేషం.