యూఎస్ లో దుమ్ము రేపేస్తున్న 'భీష్మ'
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా 'భీష్మ' వసూళ్లు
- యూఎస్ లోను అదే జోరు
- 'అ ఆ' తరువాత నితిన్ కి పెద్ద హిట్
ఇటీవల యూఎస్ లో విడుదలైన 'జాను'.. 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలు రెండూ ప్రేమకథ నేపథ్యంలో సాగినవే. అయితే ఆ రెండు సినిమాలను కూడా యూఎస్ ఆడియన్స్ పట్టించుకోలేదు. దాంతో అక్కడ ఆ రెండు సినిమాలు వసూళ్లపరంగా పూర్తిగా నిరాశపరిచాయి. ఈ నేపథ్యంలో వచ్చిన 'భీష్మ' పరిస్థితి ఎలా వుంటుందా అని అంతా అనుకున్నారు. అయితే 'భీష్మ' యూఎస్ లోను విజయవిహారం చేస్తోంది. నిన్నటి నుంచే ఈ సినిమా అక్కడ లాభాల బాట పట్టింది. 'అ ఆ' తరువాత అక్కడ అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా 'భీష్మ' నిలిచే అవకాశాలు ఎక్కువనే టాక్ బలంగా వినిపిస్తోంది.