కొయ్యబొమ్మల నేపథ్యంలో 'రాధాకృష్ణ'.. కీలక పాత్రలో లక్ష్మీ పార్వతి
- తెలుగు తెరకి మరో కొత్త దర్శకుడు
- ముగింపు దశలో 'రాధాకృష్ణ' సినిమా
- ముఖ్యమైన పాత్రలో సంపూ
అనురాగ్ - ముస్కాన్ శెట్టి జంటగా నటిస్తున్న ఈ సినిమాలో, ఒక కీలకమైన పాత్రలో లక్ష్మీ పార్వతి కనిపించనున్నారు. వినోదం - సందేశంతో కూడిన ఈ సినిమా, కొంత కాలంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది. సంపూర్ణేష్ బాబు .. కృష్ణభగవాన్ ..చమ్మక్ చంద్ర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో దర్శక నిర్మాతలు వున్నారు.