'అంధాదూన్' రీమేక్ పై దృష్టిపెట్టిన నితిన్
- 'భీష్మ'తో విజయాన్ని సాధించిన నితిన్
- తదుపరి సినిమాలుగా 'రంగ్ దే'.. 'చెక్'
- కీలక పాత్ర కోసం అన్వేషణ
హిందీలో 'టబు' పాత్ర చాలా కీలకం. తెలుగులో ఆ పాత్ర కోసం రమ్యకృష్ణ .. స్నేహ .. రెజీనా .. అనసూయల పేర్లను పరిశీలిస్తున్నారట. వీళ్లలో నుంచే ఎంపిక ఉంటుందా? మరికొంతమంది పేర్లను ఈ జాబితాలో చేరుస్తారా? అనేది చూడాల్సి వుంది. ఈ నెల 24వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు. రెగ్యులర్ షూటింగుకి చాలానే సమయం ఉండొచ్చు. ఎందుకంటే 'రంగ్ దే' .. 'చెక్' సినిమాలను పూర్తి చేసిన తరువాతనే నితిన్ రీమేక్ ను సెట్స్ పైకి తీసుకెళతాడు. మొత్తానికి ఈ ఏడాది అంతా వరుస సినిమాలతో బిజీబిజీగా గడిపేస్తాడన్న మాట.