దసరా బరిలోకి విజయ్ దేవరకొండ మూవీ?
- షూటింగు దశలో విజయ్ దేవరకొండ మూవీ
- కథానాయికగా అనన్య పాండే పరిచయం
- 50 కోట్లకి పైగా బడ్జెట్ తో నిర్మాణం
తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అందువలన ఈ స్థాయి బడ్జెట్ ను తిరిగి రాబట్టుకోవడం పెద్ద విషయమేం కాదనే నమ్మకంతో దర్శక నిర్మాతలు ఉన్నారట. డిఫరెంట్ లుక్ తో విజయ్ దేవరకొండ కనిపించనున్న ఈ సినిమాలో, ఆయన సరసన నాయికగా అనన్య పాండే నటిస్తోంది. ఈ సినిమాతోనే ఆమె తెలుగు తెరకి పరిచయమవుతోంది. అక్టోబర్లో ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా చెబుతున్నారు. దాంతో దసరా బరిలోకి ఈ సినిమాను దింపవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.