తెలుగు రాష్ట్రాల్లో 'భీష్మ' తొలిరోజు వసూళ్లు
- నిన్ననే థియేటర్లకు వచ్చిన 'భీష్మ'
- తొలి ఆటతోనే సక్సెస్ టాక్
- వసూళ్లు మరింతగా పెరిగే అవకాశం
నితిన్ కెరియర్లో 'అ ఆ' తరువాత అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా 'భీష్మ' నిలిచింది. ఈ రోజు .. రేపు వసూళ్లు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కొంతకాలంగా వరుస పరాజయాలతో డీలాపడిన నితిన్, ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూసి ఫుల్ ఖుషీ అవుతున్నాడట. నితిన్ అభిమానులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుని రష్మిక తన మార్కెట్ ను మరింతగా పెంచుకుంది. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకి, మహతి స్వరసాగర్ సంగీతాన్ని సమకూర్చిన సంగతి తెలిసిందే.