అయోమయంలో పడేస్తున్న విజయ్ దేవరకొండ 'హీరో'
- కొంతకాలం క్రితం సెట్స్ పైకి వెళ్లిన 'హీరో'
- 50 కోట్లను కేటాయించిన నిర్మాతలు
- కొన్ని రోజుల పాటు జరిగిన షూటింగ్
మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమా కోసం 50 కోట్ల బడ్జెట్ ను కేటాయించినట్టుగా వార్తలు వచ్చాయి. కొన్ని రోజుల పాటు షూటింగ్ కూడా జరిగింది. ఆ తరువాత ఏం జరిగిందో తెలియదుగానీ, ఈ సినిమా షూటింగు ఆగిపోయింది. తాత్కాలికంగా వాయిదా వేశారా? లేదంటే పూర్తిగా పక్కన పెట్టేశారా? అనే విషయంలోనే అభిమానులు అయోమయానికి లోనవుతున్నారు. ఈ విషయంపై దర్శక నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి.